కార్డులు పంచేందుకు వెళ్తూ పెళ్లి కొడుకు మృతి | bridegroom killed in road accident at warangal district | Sakshi
Sakshi News home page

కార్డులు పంచేందుకు వెళ్తూ పెళ్లి కొడుకు మృతి

Apr 20 2016 2:36 PM | Updated on Aug 30 2018 4:07 PM

వారం రోజుల్లో పెళ్లి..అంతా ఆ పనుల్లో నిమగ్నమయ్యారు.. పెళ్లికి అతిధులను ఆహ్యానించేందుకు స్వయంగా పెళ్లి కొడుకే బందువుల ఇంటికి వెళ్లాడు..

నర్సింహులపేట: వారం రోజుల్లో పెళ్లి.. అంతా ఆ పనుల్లో నిమగ్నమయ్యారు.. పెళ్లికి అతిధులను ఆహ్యానించేందుకు స్వయంగా పెళ్లి కొడుకే బందువుల ఇంటికి వెళ్లాడు.. అంతలోనే ఆ పెళ్లింట పెను విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కార్డులు పంచేందుకు బంధువుల ఇంటికి వెళ్తున్న పెళ్లి కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దముప్పారం సమీపంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

నల్లగొండ జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన సతీష్(24) వివాహం ఈనెల 27వ తేదీన జరగాల్సి ఉంది. శుభ లేఖలు పంచేందుకు సతీష్, స్నేహితుడు సురేష్(24)తో కలిసి బైక్‌పై వరంగల్ జిల్లా నర్సింహులపేటకు వచ్చాడు. పెద్దముప్పారం సమీపంలో వారి వాహనాన్ని తొర్రూర్ డిపోనకు చెందిన బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement