కేతేపల్లి: మండలంలోని ఇనుపాముల శివారు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇటుకల లారీ బోల్తా.. మహిళ మృతి
Aug 8 2016 11:45 PM | Updated on Sep 28 2018 3:41 PM
కేతేపల్లి:
మండలంలోని ఇనుపాముల శివారు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...లైట్‌వెయిట్ బ్రిక్స్‌లోడుతో లారీ ఖమ్మం జిల్లా పాలేరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో కేతేపల్లి మండలం ఇనుపాముల శివారులో గల పల్లెరుచులు హోటల్ సమీపంలోకి చేరుకోగానే లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనఫల్టీ కొట్టింది. ఈప్రమాదంలో లారీలోని ఇటుకలపై కూర్చున్న పాలేరుకు చెందిన గోపి రాధిక(32) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె భర్త రాముకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న కేతేపల్లి పోలీసులు, 108 అంబులెన్స్‌లో సిబ్బంది క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. లారీడ్రైవర్ పరారయ్యాడు.
Advertisement
Advertisement