కాకతీయ యూనివర్సిటీ పరధిలో ఎమ్మెస్సీ బాటనీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ఫలితాలు మా త్రం విడుదల కావడం లేదు.
బాటనీ పరీక్షా ఫలితాలెన్నడో..?
Aug 6 2016 12:22 AM | Updated on Sep 4 2017 7:59 AM
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరధిలో ఎమ్మెస్సీ బాటనీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ఫలితాలు మా త్రం విడుదల కావడం లేదు.
ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షకు సుమారు 700 మంది వి ద్యార్థులు హాజరయ్యారు. మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు ఇవ్వకుండానే వారికి రెండో సెమిస్టర్ పరీక్షలు కూడా ఈ ఏడాది మే–జూన్ లో నిర్వహించారు. ఇప్పుడు ఆ విద్యార్థులు ఎమ్మెస్సీ ఫైనల్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ క్లాస్‌లకు హాజరవుతున్నారు. అయినా ఇప్పటివరకు మొ దటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు ఇవ్వకపోవడం గమనార్హం. వాస్తవానికి పరీక్షలు జరిగిన 44రోజుల్లో ఫలితాలు ఇవ్వాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాల్యూయేషన్‌ను సకాలంలో నిర్వహించడంలో సంబంధిత అధికారు ల నిర్లక్ష్యం వల్లే ఫలితాల వెల్లడిలో ఆలస్యమవు తోందని తెలుస్తోంది.
Advertisement
Advertisement