నీలి కిరోసిన్‌ పట్టివేత | blue kerosene captured | Sakshi
Sakshi News home page

నీలి కిరోసిన్‌ పట్టివేత

Feb 13 2017 10:56 PM | Updated on Sep 5 2017 3:37 AM

పట్టణంలోని కేవీఎస్‌ పెట్రోల్‌ బంకు వెనుకాల గల గోడౌన్‌పై సోమవారం తహసీల్దార్‌ మునికృష్ణయ్య ఆకస్మిక దాడులు జరిపి అక్రమంగా నిల్వ ఉంచి, లెక్కచూపని 10, 280 లీటర్ల నీలి కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు

డోన్‌ టౌన్‌ : పట్టణంలోని కేవీఎస్‌ పెట్రోల్‌ బంకు వెనుకాల గల గోడౌన్‌పై  సోమవారం తహసీల్దార్‌ మునికృష్ణయ్య ఆకస్మిక దాడులు జరిపి అక్రమంగా నిల్వ ఉంచి, లెక్కచూపని 10, 280 లీటర్ల నీలి కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కిరోసిన్‌ హోల్‌సేల్‌ డీలర్‌.. కేవీఎస్‌ కంపెనీ వారికి జనవరి నెలలో 67 వేల లీటర్ల కిరోసిన్‌ను కేటాయించగా.. 54వేల లీటర్లను మాత్రమే పంపిణీ చేశారని తహసీల్దార్‌ తెలిపారు. అక్రమంగా  10,280 లీటర్ల కిరోసిన్‌ను గోడౌన్‌లో నిల్వచేయగా దాడులు జరిపి గోడౌన్‌ను సీజ్‌ చేశాన్నారు. మిగిలిన 2,720 లీటర్ల కిరోసిన్‌ ఏమయిందనే విషయంపై సరైన రికార్డులను కేవీఎస్‌ కంపెనీ చూపలేకపోయిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై జిల్లా అధికారులకు సమగ్ర నివేదిక పంపినట్లు తహసీల్దార్‌ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement