ద్విచక్ర వాహనం చోరీ | bike theft | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనం చోరీ

Aug 4 2016 12:13 AM | Updated on Sep 4 2017 7:40 AM

ఇంటి ఎదుట పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటన రహిమత్‌నగర్‌లో బుధవారం చోటుచేసుకుంది.

కాజీపేట : ఇంటి ఎదుట పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటన రహిమత్‌నగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. కుడికాల సత్యనారాయణ అనే రైల్వే ఉద్యోగి కాలనీలో నివసిస్తున్నాడు. జూౖల 31న ఆయన తన బైక్‌ను ఇంటి ఎదుట నిలిపారు. మళ్లీ వెళ్లి చూడగా ద్విచక్రవాహనం కనిపించలేదు. అంతటా వెతికినా బైక్‌ దొరకలేదు. దీనిపై బుధవారం కాజీపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ రమేష్‌కుమార్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement