బైక్‌లు ఢీ.. ఒకరి మృతి | bike-accident-young-man-died | Sakshi
Sakshi News home page

బైక్‌లు ఢీ.. ఒకరి మృతి

Jul 16 2016 11:21 PM | Updated on Sep 4 2017 5:01 AM

వేగంగా వస్తున్న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

నర్వ: వేగంగా వస్తున్న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి ఆత్మకూరు మండలం ఖానాపురం గేట్‌ సమీపంలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం నందిమళ్లకి చెందిన శ్రీను(26) హిటాచి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నర్వ మండలం ఈర్లదిన్నెకు చెందిన దిలీప్‌తో కలిసి శ్రీను ఆత్మకూర్‌లో తమ హిటాచి వాహనానికి చెందిన బ్యాటరీలను మరమ్మతు చేయించుకునేందుకు బైక్‌పై బయల్దేరారు. సాయంత్రం బ్యాటరీలు మరమ్మతులు చేయించుకుని ఈర్లదిన్నెకు తిరుగు ప్రయాణమయ్యాడు.

ఈ క్రమంలో అమరచింతకి చెందిన నాగరాజు ఆత్మకూర్‌కు బైక్‌పై వస్తుండగా, ఇరువురి వాహనాలు వేగంగా ఢీకొన్నాయి. దీంతో తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన శ్రీనును ఆత్మకూర్‌ ప్రభుత్వాసుపత్రికి ఆటోలో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దిలీప్‌ కాలు విరగడంతో పాటు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. నాగరాజుకు సైతం తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ఆత్మకూరు ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీహెచ్‌ రాజు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement