ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై పోలీసు విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం నేతలు డిమాండ్ చేశారు.
'చంద్రబాబుపై విచారణ వేగవంతం చేయాలి'
Aug 16 2016 4:17 PM | Updated on Aug 21 2018 7:18 PM
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై పోలీసు విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం నేతలు మంగళవారం మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) కార్యాలయం ముందు ధర్నా చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఏప్రిల్ నెలలో బీసీ సంఘం నేతలు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన హెచ్చార్సీ విచారణ చేయాలని డీజీపీని ఆదేశించింది. విచారణ చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని బీసీ సంఘం నేత డేరంగుల ఉదయ్‌కిరణ్ ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యంపై హెచ్చార్సీ చైర్మన్ కక్రూకు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీబీసీఐడీకి బదలాయించాలని కోరారు.
Advertisement
Advertisement


