హాస్టళ్లలో ఇన్‌చార్జి వార్డెన్‌లు | basic emuinities | Sakshi
Sakshi News home page

హాస్టళ్లలో ఇన్‌చార్జి వార్డెన్‌లు

Jul 17 2016 11:34 PM | Updated on Sep 4 2017 5:07 AM

నియోజకవర్గవ్యాప్తంగా వసతిగృహాల్లో పారిశుధ్యం మెరుగైనప్పటికీ చాలా చోట్ల మరుగుదొడ్లు పనిచేయడం లేదు. వర్షాకాలం ప్రారంభంకావడంతో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరుగుదొడ్ల నిర్వాహణపై అధికారులు దృష్టిసారించాలి. భైంసా బీసీ బాలుర వసతిగృహాంలో మరుగుదొడ్లు పనిచేయడంలేదు.

  • స్థానికంగా ఉండేలా చర్యలు అవసరం
  • భైంసా: నియోజకవర్గవ్యాప్తంగా వసతిగృహాల్లో పారిశుధ్యం మెరుగైనప్పటికీ చాలా చోట్ల మరుగుదొడ్లు పనిచేయడం లేదు. వర్షాకాలం ప్రారంభంకావడంతో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరుగుదొడ్ల నిర్వాహణపై అధికారులు దృష్టిసారించాలి. భైంసా బీసీ బాలుర వసతిగృహాంలో మరుగుదొడ్లు పనిచేయడంలేదు.
                       70 మంది పిల్లలు ఉన్న ఈ వసతి గృహంలో రెండే మరుగుదొడ్లు పనిచేస్తున్నాయి. ఇక కుభీర్‌లోని ఎస్టీ, బీసీ వసతిగృహాలకు, పల్సి బీసీ వసతిగృహానికి ఇన్‌చార్జి వార్డెన్‌లే పనిచేస్తున్నారు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూడాల్సిన వార్డెన్‌ల స్థానంలో ఇన్‌చార్జిలకు అప్పగించడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కుభీర్‌ బీసీ వసతిగృహం అద్దె గదిలోనే కొనసాగుతోంది. స్థానికంగా పారిశుధ్యనిర్వాహణ సక్రమంగా లేదు.
              ముథోల్, బాసర, కుంటాల వసతిగృహాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. విద్యార్థులు అస్వస్థతకులోనైన సమయంలోనే సమీపంలోని వైద్యశాలలకు తీసుకువెళ్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యందృష్ట్యా ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు జరిగేలా చూడాలని పోషకులు కోరుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురియడంతో అధికారులు అప్రమత్తంగాఉండాలని పోషకులుకోరుతున్నారు. 
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement