ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన | awareness on aids | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన

Nov 17 2016 12:08 AM | Updated on Jun 1 2018 8:39 PM

ఎయిడ్స్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.వెంకటరమణ, అడిష¯ŒS డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పద్మావతి తెలిపారు.

అనంతపురం మెడికల్‌ : ఎయిడ్స్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌  కె.వెంకటరమణ, అడిష¯ŒS డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పద్మావతి తెలిపారు.  డిసెంబర్‌ 1వ తేదీన ’ప్రపంచ ఎయిడ్స్‌ డే’ పురస్కరించుకుని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చాంబర్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం హెచ్‌ఐవీ బాధితులు పెరుగుతున్నారని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. వచ్చేనెల 1న జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement