
2018 నాటికి మిగులు విద్యుత్
తెలంగాణను 2018 చివరకల్లా మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలబెడతామని విద్యుత్‌శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి తెలి పారు. పవర్ కట్ అనేది ఉండకుండా
మండలిలో మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను 2018 చివరకల్లా మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలబెడతామని విద్యుత్‌శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి తెలి పారు. పవర్ కట్ అనేది ఉండకుండా చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ తదితర అవసరాలకు 2018-19 నాటికి 24 వేల మెగావాట్ల మేర ఒకేసారి పంపిణీచేసే వ్యవస్థను రూపొం దించుకునే దిశలో పనిచేస్తున్నట్టు చెప్పారు. అన్ని పవర్ ప్రాజెక్టులకు ఆర్థికవెసులుబాటును సాధించామని, అనుకున్న సమయానికి వాటిని పూర్తిచేస్తామని తెలిపారు. స్వల్ప, దీర్ఘకాలిక ఒప్పందాలతో 3,300 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామన్నారు. మంగళవారం శాసనమండలిలో విద్యుత్‌పై స్వల్పకాలిక చర్చ కు మంత్రి సమాధానమిచ్చారు.
విద్యుత్ ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతుల కోసం ఏళ్లకు ఏళ్లు సమయం పడుతుండగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్వల్పకాలంలో వాటిని సాధించిందని తెలిపారు. హైదరాబాద్ నగరానికి రూ.700 కోట్లతో ఒక 400 కేవీ, ఆరు 200 కేవీ, ఇరవై 132 కేవీ, అరవై 33 /11 కేవీల కోసం పనులు చేపడుతున్నామని, దీంతోపాటు అండర్‌గ్రౌండ్ వైరింగ్ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ఆయా దశల్లో అవసరమైన చర్యలు తీసుకుని రైతులకు అవసరమైన కరెంట్ ఇస్తామని, వచ్చే ఏప్రిల్ నుంచి పగటిపూటే 9 గంటల విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.