ఎయిర్‌హోస్టస్‌ కేసులో నిందితుడి అరెస్టు | Arrest of the accused in the case airhostes | Sakshi
Sakshi News home page

ఎయిర్‌హోస్టస్‌ కేసులో నిందితుడి అరెస్టు

Aug 31 2016 9:29 PM | Updated on Oct 4 2018 8:29 PM

ఎయిర్‌హోస్టస్‌ కేసులో నిందితుడి అరెస్టు - Sakshi

ఎయిర్‌హోస్టస్‌ కేసులో నిందితుడి అరెస్టు

ఎయిర్‌హోస్టస్‌పై అఘాయిత్యానికి యత్నించిన నిందితుడిని రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అత్తాపూర్‌: ఎయిర్‌హోస్టస్‌పై అఘాయిత్యానికి యత్నించిన నిందితుడిని రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  ఇన్‌స్పెక్టర్‌ ఉమేందర్‌ కథనం ప్రకారం... ఉప్పర్‌పల్లి హ్యాపిహోమ్స్‌ ప్రాంతానికి చెందిన యువతి (24) ఓ ఎయిర్‌లైన్‌ సంస్థలో ఎయిర్‌హోస్టస్‌.  సోమవారం అర్దరాత్రి మందులు కొనుగోలు చేయడానికి డెయిరీ ఫామ్‌ సమీపంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నెంబర్‌ 216 వద్దకు వచ్చింది. షాపులు మూసి వేయడంతో రోడ్డు పక్కన ఒంటరిగా నిలబడి ఉన్న ఆమె వద్దకు క్యాబ్‌ (క్వాలీస్‌ కారు) వచ్చి ఆగింది. డ్రైవర్‌ ఆమెకు మాయమాటలు చెప్పి తన కారులో ఎక్కించుకున్నాడు.

ఔటర్‌రింగ్‌రోడ్డు... కిషన్‌గూడ మీదుగా శంషాబాద్‌ హిమాయత్‌సాగర్‌కు తీసుకొచ్చి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించి అరవడంతో సెన్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడు వాడిన క్యాబ్‌  ( నెం. ఏపీ 09ఎక్స్‌ 2865)ను గుర్తించారు. నిందితుడు కిస్మత్‌పూర్‌ గ్రామానికి చెందిన కారు డ్రైవర్‌ మీర్జా అహ్మద్‌బేగ్‌ అలియాస్‌ ఇమ్రాన్‌ను గండిపేటలో బుధవారం అరెస్ట్‌ చేశారు. విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement