అర్జున్‌ మరణం సీపీఐకి తీరనిలోటు | Arjun death loss for CPI | Sakshi
Sakshi News home page

అర్జున్‌ మరణం సీపీఐకి తీరనిలోటు

Aug 8 2016 12:06 AM | Updated on Sep 4 2017 8:17 AM

అర్జున్‌ మరణం సీపీఐకి తీరనిలోటు

అర్జున్‌ మరణం సీపీఐకి తీరనిలోటు

సీనియర్‌నాయకుడు మాజీ ఎంపీటీసీ ఎర్ర అర్జున్‌ మరణం సీపీఐ పార్టీకి తీరనిలోటని ఆ పార్టీ జిల్లాకార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి తెలిపారు.

రామన్నపేట
సీనియర్‌నాయకుడు మాజీ ఎంపీటీసీ ఎర్ర అర్జున్‌ మరణం సీపీఐ పార్టీకి తీరనిలోటని ఆ పార్టీ జిల్లాకార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి తెలిపారు. పార్టీ జిల్లానాయకులతో కలిసి ఆదివారం ఆయన అర్జున్‌ మృతదేహాన్ని  కొమ్మాయిగూడెంలో సందర్శించారు.  పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.  నివాళులు అర్పించినవారిలో నెల్లికంటి సత్యం, లొడంగి శ్రవణ్‌కుమార్, ఊట్కూరి నర్సింహ, మునుకుంట్ల నాగయ్య, గంగాపురం యాదయ్య, తెల్ల మోహన్, కూనూరు క్రిష్ణగౌడ్, ఎర్ర శేఖర్, డి.సమ్మయ్య, ఎస్‌.సమ్మయ్య, లగ్గోని యాదయ్య  ఉన్నారు.
సీపీఎం నాయకుల సంతాపం
అర్జున్‌ మృతదేహాన్ని సీపీఎం నాయకులు  సందర్శించి నివాళులర్పించారు. వారిలో మండలకార్యదర్శి జెల్లెల పెంటయ్య, మునుకుంట్ల ఎల్లయ్య, మన్నెం సత్తిరెడ్డి, ఎర్ర కాటమయ్య, రవిందర్, నాగయ్య, సత్తయ్య, , లింగస్వామి, శివారెడ్డి, గిరి, శ్రీను, నరేష్‌ ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement