పెళ్లి పత్రిక చూపినా డబ్బు ఇవ్వరాయే | amount not given for wedding | Sakshi
Sakshi News home page

పెళ్లి పత్రిక చూపినా డబ్బు ఇవ్వరాయే

Nov 19 2016 10:54 PM | Updated on Sep 4 2017 8:33 PM

వివాహ కార్డును చూపుతున్న పురుషోత్తం

వివాహ కార్డును చూపుతున్న పురుషోత్తం

వివాహానికి డిపాజిట్‌ చేసిన సొమ్ములో నుంచి రూ. 2.50 లక్షల వరకు డ్రా చేసుకోవచ్చుననే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు.

ఆందోళనలో పెళ్లి కుమార్తె తండ్రి  
నూనెపల్(కర్నూలు)లె: వివాహానికి   డిపాజిట్‌ చేసిన  సొమ్ములో నుంచి రూ. 2.50 లక్షల వరకు డ్రా  చేసుకోవచ్చుననే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. దీంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. చిత్రంలో కనిపిస్తున్న ఈయన పురుషోత్తం. నంద్యాల పట్టణంలో రైల్వేశాఖలోని ఎలక్ట్రికల్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఈయన తన కుమార్తె దివ్యకు ఈనెల 24వ తేదీన వివాహం చేయనున్నాడు. అందుకు నూనెపల్లెలోని ఆంధ్రాబ్యాంక్‌లోని తన ఖాతాలో   దాచుకున్న సొమ్ము రూ. లక్షతో పాటు   బ్యాంక్‌లో  తీసుకున్న రుణం మొత్తం​కలిపి  రూ. 6 లక్షలు ఉంది. ఈ డబ్బుతో బిడ్డ పెళ్లి  చేయాలనుకున్నాడు.

అంతలోపే కేంద్రం పెద్దనోట్ల రద్దు చేయడంతో డా​‍్ర చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. పెళ్లికి రూ. 2.50 లక్షల వరకు ఇవ్వవచ్చునని కేంద్రం చెప్పినా  వారానికి రూ. 20వేలు మించి ఇవ్వమని బ్యాంకు అధికారులు చెబుతున్నారని వాపోతున్నాడు. ఎందుకిలా అని బ్యాంకు మేనేజర్‌ను ప్రశ్నిస్తే తమకు ఇప్పటి వరకు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌  నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదంటునారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై బ్యాంక్‌ మేనేజర్‌ హరీష్‌ కుమార్‌ వివరణ కోరితే   వారంలో రూ. 24వేలు మాత్రమే ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిందనా​​‍్నరు.  ఎక్కువ మొత్తంలో నగదు ఇవ్వలేమని,  పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లకు అవసరమైతే (షామియానా, వంట మాస్టర్) సంబంధిత వారి ఖాతాలను అందిస్తే అందులోకి బదలాయిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement