విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి | Agriculture labour died with electrical shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

Sep 6 2016 10:35 PM | Updated on Sep 5 2018 3:38 PM

విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి - Sakshi

విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి

శ్రీనివాస్‌నగర్‌(మిర్యాలగూడ రూరల్‌) : విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని తుంగపహాడ్‌ గ్రామ పంచాయతీ శివారు శ్రీనివాస్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది.

శ్రీనివాస్‌నగర్‌(మిర్యాలగూడ రూరల్‌) : విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని తుంగపహాడ్‌ గ్రామ పంచాయతీ శివారు శ్రీనివాస్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ వి. సర్దార్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం తోపుచర్ల పంచాయతీ శివారు సీత్యాతండాకు చెందిన ధనావత్‌ శంకర్‌ నాయక్‌(40) కొంతకాలంగా కుటుంబంతో కలిసి శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్నాడు. తుంగపహాడ్‌ గ్రామానికి చెందిన రైతులు గుబ్బల శ్రీనివాస్, మిర్యాలగూడ పట్టణానికి చెందిన చిరుమామిళ్ల కోటేశ్వర్‌రావు వద్ద ఐదు ఎకరాలు భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గుబ్బల శ్రీనివాస్, ధనావత్‌ శంకర్‌ నాయక్‌ను పొలం పని కోసం కూలీకి పిలిచాడు. పొలంలో పని ముగించుకొని వెళ్తుండగా పొలం గట్టుపై ఉన్న విద్యుత్‌ సర్వీస్‌ వైర్లు ఉన్న టెలిఫోన్‌ స్తంభం ఉంది. ఆసరా కోసం పొలం నుంచి బయటకు వస్తుండగా శంకర్‌ స్తంభాన్ని పట్టుకున్నాడు. స్థంభానికి విద్యుత్‌ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతి చెందిన శంకర్‌ నాయక్‌ను కౌలు రైతు గమనించాడు . అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించామని,  మృతుని భార్య చున్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement