ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్‌నగర్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
Jul 20 2016 11:17 PM | Updated on Jul 11 2019 6:28 PM
ఆదిలాబాద్ క్రైం : ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్‌నగర్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. భీంరావు నార్వేడే బుధవారం తన కుటుంబ సభ్యులతో ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు ఉదయం వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భీంరావుకు సమాచారం అందించారు. ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ చేరుకునేలోపే స్థానికులు మంటలు ఆర్పేశారు. భీంరావు ఇంటికి వచ్చే సరికి పూర్తిగా ఇల్లు దగ్ధమైంది. ఇంటిపై కప్పుతో పాటు ఇంట్లోని టీవీ, బీరువా, అందులోని రూ. 1200 నగదుతో పాటు, ముఖ్యమైన దస్తావేజులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ. లక్ష వరకు ఆస్తినష్టం జరిగిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వార్డు కౌన్సిలర్ విజయ్ వారిని పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందేలా చూస్తామని విజయ్ పేర్కొన్నారు.
Advertisement
Advertisement


