వాగులో పడి ఇద్దరు చిన్నారుల మృతి | 2 children killed in khammam district | Sakshi
Sakshi News home page

వాగులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Jul 2 2016 3:49 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఖమ్మం జిల్లా పాల్వంచలో విషాదం చోటు చేసుకుంది.

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఉతకడానికి వాగుకు వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు. ఈ సంఘటన మండలంలో కుంటినాగులగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రోహిణి(12) ఏడో తరగతి, మోకాళ్ల శిరీష(15)పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరు ఈ రోజు గ్రామ శివారులోని ముర్రేడు వాగుకు దుస్తులు ఉతకడానికి వెళ్లారు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రోహిణి వాగులో పడి మునిగి పోయింది. ఇది గుర్తించిన శిరీష ఆమెను రక్షించడానికి యత్నించి తాను కూడా వాగులో పడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు మృతదేహాలను వెలికి తీశారు. స్నేహితులిద్దరి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement