పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో జిల్లా ఘనమైన విజయాలను సొంతం చేసుకుంది. ప్రభు త్వ పాఠశాలల్లో మెరికల్లాంటి విద్యార్థులు పదికి పదికి పా యింట్లు సాధించి ప్రైవేటు పాఠశాలలకు దీటైన పోటీనిచ్చారు. అయితే ఈసారి
-
పది ఫలితాల్లో జిల్లాకు వరుసగా ర్యాంకులు
-
సీసీఈ విధానమున్నా ఆ స్థానం ‘పది’లమేనంటున్న విద్యాశాఖ అధికారులు
-
పరీక్షలకు హాజరవనున్న విద్యార్థులు 68,853
భానుగుడి (కాకినాడ) :
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో జిల్లా ఘనమైన విజయాలను సొంతం చేసుకుంది. ప్రభు త్వ పాఠశాలల్లో మెరికల్లాంటి విద్యార్థులు పదికి పదికి పా యింట్లు సాధించి ప్రైవేటు పాఠశాలలకు దీటైన పోటీనిచ్చారు. అయితే ఈసారి పరీక్షలకు సంబం ధించి నిరంతర సమగ్ర మూ ల్యాంకన విధానం ఆది నుంచి అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు తల నొప్పిగా మా రింది. దీంతో ప్రస్తుతం పదిస్థానంపై అనుమానాలు ఎక్కువయ్యాయి.
సర్కారు నిర్ణయాలతో...
ప్రభుత్వం అడ్డగోలుగా ఒకేసారి విద్యా విధానాన్ని మార్చివేసింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు గందరగోళ పరి స్థితిలోకి వెళ్ళారు. అప్పటి వరకు 9వ తరగతి వరకు ఒక విద్యా విధానానికి అలవాటుపడ్డ ప్రస్తుత పదో తరగతి విద్యార్థి ఒకేసారి ఒక కొత్త విధానంలోకి మారాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిపై ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహిస్తామన్న విద్యాశాఖ ప్రత్యక్షంగా ఒక శిక్షణా తరగతిని నిర్వహించిందీ లేదు. ఎఫ్‌ఏ–1,2,3,4 పరీక్షలకు సంబంధించి మార్కుల పైనా, సమ్మెటివ్–1,2లపైనా ఎటువంటి సమీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. దీనికితోడు మూడు నెలలుగా ఉపాధ్యాయులకు ఎమ్‌ఈవో ప్రమోషన్లు, పండిట్, పీఈటీ అప్‌గ్రేడేషన్లు, ఉపాధ్యాయుల బదిలీలంటూ గందరగోళానికి గురిచేశారు. సరిగ్గా పరీక్షలు దగ్గరపడే సమయానికి 50 మంది ప్రధానోపాధ్యాయులను ఎమ్‌ఈవోలుగా ప్రమోష¯ŒS కల్పించి ఆయా పాఠశాలలను దిక్సూచి లేని నావలా మార్చేశారు. జనవరి వరకు గ్రిగ్స్ పోటీలు నిర్వహించడం, డీఈవోలకు బదిలీలు పెట్టడం, ఇవన్నీ పదో తరగతి పరీక్షల మీద ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకు ఒకే ఒక్క డీవైఈవో ఉన్నారు... మిగిలిన చోట్ల గందరగోళ పరిస్థితిలో విద్యాశాఖ కొట్టుమిట్టాడుతోంది.
1 నుంచి 3 స్థానాల్లో నిలిచిన ఘనత జిల్లాదే.
2012 సంవత్సరం నుంచి గతేడాది వరకు పదో తరగతి ఫలితాల్లో
1 నుంచి 3 వరకు ర్యాంకులు సాధించిన ఘనత జిల్లాకు దక్కుతుంది.
సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉత్తీర్ణతా శాతం ర్యాంకు
2012–13 58,781 55,488 94.40 3
2013–14 60,431 63,217 96.26 1
2014–15 65,338 63,217 96.75 2
2015–16 67,493 65,850 97.57 3
ఈ సారి ఉన్నత స్థానమే...
గత మూడు సంవత్సరాలుగా ఉత్తీర్ణతా శాతం పెరుగుతూ వస్తోంది. పదో తరగతి పరీక్షలకు సంబం ధించి అన్ని చర్యలూ తీసుకున్నాం. గత కొన్ని నెలలుగా ప్రత్యేక బృందాలు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రతీ విద్యార్థి వ్యక్తిగత సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీచేశాం. ఆ¯ŒSలై¯ŒSలో విద్యార్థుల మార్కుల ఆధారంగా ఉపాధ్యాయులకు సూచనలిచ్చాం. ఈసారి మెరుగైన స్థానాన్ని ఖచ్చితంగా జిల్లా సాధిస్తుంది.
– డీఈవో అబ్రహం