కాటేసిన ప్రలోభం

Young man molested Girl Child And Pregnant in Orissa - Sakshi

గర్భం దాల్చిన బాలిక   

తీవ్ర ఆందోళనలో కుటుంబం

సాక్షి, జయపురం(ఒడిశా): తెలిసీ తెలియని వయసు.. చెంగుచెంగున గెంతుతూ తోటి పిల్లలతో ఆటలాడుకునే బాలిక (12) ఏడు నెలల గర్భిణి అని తెలిసి బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ సంఘటన నవరంగపూర్‌ జిల్లా పపడహండి పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాలిక గర్భవతి కావడానికి కారకుడైన యువకుడిపై బాధిత కుటుంబసభ్యులు పపడహండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక  ప్రతి రోజూ  తమ  ఇంటికి కొంత దూరంలోగల పాఠశాలకు చదువుకునేందుకు వెళ్లేది. ఆమె పాఠశాలకు ఒంటరిగా వెళ్తున్న సమయాన్ని ఆసరాగా తీసుకున్న ఘుషురగుడ గ్రామానికి చెందిన రాజీవ్‌ మఝి అనే యువకుడు  ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. అమాయకురాలైన ఆ బాలిక యువకుడితో మాట్లాడుతూ ఉండేది. ఆ అవకాశాన్ని వినియోగించుకుని  పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టిన ఆ యువకుడు బాలికతో శారీరక సంబంధం  కొనసాగించాడు. తన శరీరంలో వస్తున్న మార్పులపై ఆ బాలికకు అవగాహన లేదు. రానురాను శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపించడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. అప్పటికే ఆమెకు 7 నెలలు గడిచాయి.

గర్భిణిగా ధ్రువీకరించిన వైద్యులు
15 రోజుల కిందట కుటుంబసభ్యులు బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. ఆ పరీక్షలలో ఆ బాలిక 7 నెలల గర్భిణి అని వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలియడంతో ఆమెను పాఠశాలకు వెళ్లకుండా చేశారు. ఆ బాలిక నుంచి విషయాలు తెలుసుకున్న తల్లిదండ్రులు పపడహండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి తమ బిడ్డ గర్భిణి కావడానికి కారకుడైన రాజీవ్‌ మఝిపై కేసు పెట్టారు. పోలీసులు కేసు నమో దు చేసి రాజీవ్‌ను అరెస్టు చేశారు. ప్రాపంచిక విషయాలు, భార్యభర్తల సంబంధాలపై ఎటువంటి అవగాహన లేని తమ బిడ్డ నేడు 7 నెలల గర్భిణి అయిందన్న చింత ఆ కుటుంబాన్ని వేధిస్తోంది. పరువుగా బతికే తాము సభ్య సమాజంలో ఏ విధంగా తలెత్తుకుని తిరగగలమని వారు వాపోతున్నారు. తమ బిడ్డ భవిష్యత్తు ఏమిటి? పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు ఏమిటి? బిడ్డను ఎలా సాకాలి అన్న చింత వారిని  వేధిస్తోంది.  రాజీవ్‌ కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసినా చట్ట ప్రకారం చెల్లదు. ఇంకా ఆమెకు  ఆరేళ్లు గడిస్తే కానీ వివాహానికి అర్హురాలు కాదు. అంతవరకు పుట్టబోయే బిడ్డతో ఆమె జీవితం ఎలా సాగుతుంది. పుట్టబోయే బిడ్డను రాజీవ్‌ కుబుంబం అంగీకరిస్తుందా? అన్నది చర్చనీ యాంశమైంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top