గొడవ చేయొద్దన్నందుకు.. దారుణంగా హత్య

Young Man Killed In Knife Attack At Attapur - Sakshi

తాగి వాగ్వాదం చేసుకుంటున్న ఇద్దరికి మందలింపు 

దీంతో కక్షగట్టి కత్తులతో దాడి, హత్య 

తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి 

సాక్షి, హైదరాబాద్‌:  ఫంక్షన్‌ వద్ద తాగి గొడవ చేయొద్దు అనడంతో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సులేమాన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఇక్బాల్‌ కుమారుడు ఫిరోజ్‌ (22) శనివారం రాత్రి చింతల్‌మెట్‌లోని ఉర్దూ మాధ్యమం పాఠశాల వద్ద ఓ వివాహ విందుకు హాజరయ్యాడు. అయితే విందు సమీపంలో స్థానిక యువకులు సర్వర్, మోసీన్‌ మద్యం తాగి గొడవ పడుతున్నారు. అక్కడకు వెళ్లిన ఫిరోజ్‌ గొడవపడొద్దని వారిని వారించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇది మనసులో పెట్టుకున్న సర్వర్, మోసీన్‌ ఫిరోజ్‌పై దాడి చేయాలని పథకం పన్నారు. అర్ధరాత్రి సమయంలో ఫిరోజ్‌ను ఇంటి నుంచి బయటకు పిలిచి కత్తులతో పొడిచారు. తీవ్ర గాయాలపాలవడంతో ఫిరోజ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సర్వర్, మోసిన్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి చింతల్‌మెట్‌లో హత్య జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top