వాట్సాప్‌లో అసభ్యకర ఫొటోలు

Young Man Arrest in Cyber crime Case Hyderabad - Sakshi

యువతి ఫిర్యాదుతో నిందితుడి అరెస్టు

నాగోలు: వాట్సాప్‌ ద్యారా ఓ యువతికి సంబంధించిన ఫొటోలు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం  మంగళపేట చెందిన హోసాలి శివకుమార్‌ నగరంలోని బాలాపుర్‌లో ఓ రెస్టారెంట్‌లో బార్‌ వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన యువతితో పరిచయమైంది. ఆమె పూర్తి వివరాలు సేకరించాడు. ఓ రోజు శివకుమార్‌ సదరు యువతి హోటల్‌కు తీసుకెళ్లి ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చాడు. అనంతరం యువతి  పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఫొటోలను తీశాడు. ఆ ఫొటోలు ఆమెకు చూపిస్తూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. ఫొటోలను యువతి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపించసాగాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాచకొండ సైబర్‌ క్రైం సీఐ విజయ్‌కుమార్‌ దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాలతో శివకుమార్‌ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top