సొంతింటికే కన్నం.. భర్తకు తెలియకుండా.. | Woman Steals Gold From Own House In Tamilnadu | Sakshi
Sakshi News home page

 సొంతింటికే కన్నం.. భర్తకు తెలియకుండా..

Apr 5 2020 12:47 PM | Updated on Apr 5 2020 12:59 PM

Woman Steals Gold From Own House In Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నాటకం ఆడిన భార్య గట్టురట్టయ్యింది. ఆమెను..

చెన్నై : తూత్తుకుడి హార్బర్‌ ఉద్యోగి ఇంట్లో వంద సవర్ల నగలు దోపిడీ కేసు విచారణ మలుపు తిరిగింది. భర్తకు తెలియకుండా చోరీచేసి నాటకం ఆడిన భార్య గట్టురట్టయ్యింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తూత్తుకుడి తాలముత్తునగర్‌ సమీపం పెరియసెల్వం నగర్‌కు చెందిన విన్సెంట్‌ (59) తూత్తుకుడి హార్బర్‌లో పనిచేస్తున్నారు. అతని భార్య ఝాన్సీ. వీరి ఇద్దరు కుమార్తెలకు వివాహమై ఒకరు తూత్తుకుడిలో, మరొకరు పుదుచ్చేరిలో ఉన్నారు. ( గిలగిలా గింజుకుంటున్న మందు బాబులు )

గురువారం రాత్రి విన్సెంట్‌ ఇంట్లో 100 సవర్ల నగలు, రూ.20వేలు చోరీకి గురయ్యింది. విన్సెంట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా ఝాన్సీ పొంతన లేని సమాధానం చెప్పడంతో ఆమెను తీసుకెళ్లి విచారణ చేశారు. వంద సవర్ల నగలు, రూ.20వేలు ఆమె చోరీ చేసినట్టు తెలిసింది. ఆమెను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement