చెల్లికి పెళ్లి చేయలేకపోతున్నానని.. | Woman Commits Suicide In KPHB Colony hyderabad | Sakshi
Sakshi News home page

చెల్లికి పెళ్లి చేయలేకపోతున్నానని..

Sep 6 2018 11:46 AM | Updated on Nov 6 2018 8:08 PM

Woman Commits Suicide In KPHB Colony hyderabad - Sakshi

లావణ్య మృతదేహం

కేపీహెచ్‌బీకాలనీ: చెల్లికి పెళ్లి చేయలేకపోతున్నానని మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉ న్నాయి. అడ్డగుట్ట సొసైటీలో ఉంటున్న గోవింద్, లావణ్య(30) దంపతులు స్థానిక శ్రీరామ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అయితే లావణ్య తన సోదరికి వివాహం చేయలేకపోతున్నాననే గత కొంతకాలంగా బాధపడుతోంది. దీంతో మనస్తాపానికిలోనైన ఆమె ఈనెల 3న  గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement