లాక్‌డౌన్‌ వేళ జంట హత్యలు | Woman Allegedly Abused The Elderly Couple | Sakshi
Sakshi News home page

అత్త, మామలను కడతేర్చిన కోడలు

Apr 24 2020 3:56 PM | Updated on Apr 24 2020 3:56 PM

Woman Allegedly Abused The Elderly Couple - Sakshi

దేశ రాజధానిలో దారుణం

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో దేశ రాజధానిలో దారుణం జరిగింది. భర్త, పిల్లలు ఇంట్లో ఉండగానే అత్తా, మామలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కోడలు ఉదంతం వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీ చవ్లా ప్రాంతంలోని దుర్గా విహార్‌ ఫేజ్‌-2లోని తమ ఇంటిలో కవిత (35) అనే మహిళ తన అత్తమామలు రాజ్‌ సింగ్‌(61), ఓంవతి (58)లను దారుణంగా కొట్టి ఆపై కసితీరా కత్తితో పొడిచి చంపిందని పోలీసులు వెల్లడించారు. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఆమె భర్త సతీష్‌ సింగ్‌ (37)నూ ఈ కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. జంట హత్యల కేసులో కవిత, ఆమె భర్తను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

చదవండి : ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement