భర్త ఆచూకీని కనిపెట్టకపోతే.. | Wife Warning to Police For Husband Missing Case in Karnataka | Sakshi
Sakshi News home page

భర్త ఆచూకీని కనిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటా

Feb 26 2019 11:27 AM | Updated on Feb 26 2019 11:27 AM

Wife Warning to Police For Husband Missing Case in Karnataka - Sakshi

జై జినిషా దంపతులు(ఫైల్‌)

కర్ణాటక, బొమ్మనహళ్లి : తన భర్త ఆచూకీని కనిపెట్టకపోతే  పోలీస్‌స్టేషన్‌ ముందు ఆత్మహత్య చేసుకుంటానని ఓ మహిళ  సామాజిక మాధ్యమంద్వారా పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. వివరాలు.. హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో  జై జినిషా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహమైంది.

దంపతులకు ఏడాది వయసున్న బిడ్డ ఉంది. ఇదిలా ఉండగా ఆరు నెలలుగా జై కనిపించకుండా పోయాడు. దీంతో తన భర్త ఆచూకీ కనిపెట్టాలని జినిషా హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిది. పోలీసులు జై కోసం గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది.  ఈ విషయాన్ని పోలీసులు ఆమెకు తెలియజేశారు. దీంతో మనోవేదనకు గురైన జినిషా... తన భర్తను వెతికి తనకు అప్పగించాలని,  లేదంటే పోలీస్‌స్టేషన్‌ముందే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను హెచ్చరిస్తూ సామాజి మాధ్యమాల్లో పోస్టు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement