భార్య, కుమారుడిని కడతేర్చిన కసాయి | Two People Brutally Murdered In Medchal | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌లో దారుణం: హత్యచేసి.. కాల్చి బూడిద చేసి

Feb 10 2019 9:38 PM | Updated on Feb 10 2019 11:47 PM

Two People Brutally Murdered In Medchal - Sakshi

సాక్షి, మేడ్చల్‌: జిల్లాలోని కొండాపూర్‌ రెవెన్యూ గ్రామ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి తన భార్య, కుమారుడిని దారుణంగా హత్యచేసి, అనంతరం కాల్చిబూడిద చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా బొల్లికుంట గ్రామానికి చెందిన సుశ్రుత అనే యువతి రెండు సంవత్సరాల క్రితం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడూరు గ్రామానికి చెందిన రమేష్‌ అనే యువకుడ్ని ప్రేమించింది. సుశ్రుత, రమేష్‌ల కులాలు వేరుకావటంతో రమేష్‌ కుటుంబసభ్యులు వారి పెళ్లికి నిరాకరించారు. దీంతో వారు ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి నాలుగు నెలల బాబు ఉన్నాడు.

అయితే ఇటీవలి కాలంలో వారి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో సుశ్రుత.. గత కొంతకాలంగా తన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే నిన్న ఆమెను కలవాలని ఉప్పల్‌కు పిలిచిన రమేశ్‌ కొండాపూర్‌లోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ సుశ్రితతో పాటు, తన కుమారుడిని హత్య చేసి.. ఘట్‌కేసర్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో తగలపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై బాధితురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు నిజం వెలుగుచూసింది. తానే ఈ హత్యలు చేసినట్టు రమేశ్‌ పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement