షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ప్రమాదం

Two Died in Road Accident At Shadnagar toll Plaza - Sakshi

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ టోల్‌ ప్లాజా వద్ద మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. టోల్‌ ప్లాజా వద్ద ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. హైదరాబాద్‌ నుంచి జడ్చర్ల వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు నాగర్‌కర్నూల్‌ వాసులుగా గుర్తించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top