రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పు | two buses burn | Sakshi
Sakshi News home page

రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పు

Dec 20 2017 8:42 AM | Updated on Sep 5 2018 9:47 PM

సాక్షి, సికింద్రాబాద్: ఉప్పల్ చెరువు కట్ట సమీపంలో పార్కింగ్ చేసిన ఉప్పల్ డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులకు గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి నిప్పంటించారు. ఈ దుర్ఘటనలో బస్సుల ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా ఆనవాళ్లు కనబడుతున్నాయి. స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారమివ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. అలాగే సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బస్సులకు నిప్పు పెట్టిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement