ఐపీఎల్‌ క్రేజ్‌.. బుకీల అరెస్టు | Two Bookies Arrested in Guntur | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ క్రేజ్‌.. బుకీల అరెస్టు

May 12 2019 6:12 PM | Updated on May 12 2019 8:19 PM

Two Bookies Arrested in Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: ఐపీఎల్‌కు ఎంత క్రేజ్‌ ఉంటుందో మాటల్లో చెప్పక్కర్లేదు. అందులోనూ ఫైనల్‌ మ్యాచ్‌ అంటే అటు క్రీడాభిమానులకు పండగే పండగ. వాళ్లతో పాటు బుకీలు కూడా అంతే సంబరాలు చేసుకుంటారు. వందల కోట్ల రూపాయల్లో ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై పందేలను బుకీలు నిర్వహిస్తుండటంతో వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇద్దరు బూకీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోల్‌కతాకు చెందిన అభీర్‌ చంద్‌, శ్యాంఘోష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement