నడిరోడ్డుపై నగ్నంగా ట్రాన్స్‌జెండర్స్‌ రచ్చ!

Transgenders Strip Naked in South Delhi Green Park - Sakshi

న్యూఢిల్లీ : దేశరాజధానిలో టాన్స్‌జెండర్స్‌ రెచ్చిపోయారు. నగ్నంగా డ్యాన్స్‌లు చేస్తూ .. వాహనాలు అడ్డుకుంటూ రచ్చచేశారు. ఈ ఘటనను ఓ వాహనదారుడు మొబైల్‌లో చిత్రికరించగా..ఈ వీడియోలు వాట్సాప్‌లో చక్కర్లుకొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ట్రాన్స్‌జెండర్స్‌ చట్టవ్యతిరేక(అర్ధరాత్రి రోడ్డుపై తిరగడం, వ్యభిచారం, డబ్బులు వసూలు చేయడం) పనులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనగా నడిరోడ్డుపై నగ్నంగా రచ్చచేశారు.

8 నుంచి 10 మంది ట్రాన్స్‌జెండర్స్‌ రెండు గ్రూప్‌లుగా ఏర్పడి దక్షిణ ఢిల్లీ, గ్రీక్‌పార్క్‌ రోడ్డులో ట్రాఫిక్‌ను అడ్డుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. కొంత మంది నగ్నంగా మరికొంత మంది అర్ధనగ్నంగా వాహనాలపై ఎక్కి డ్యాన్స్‌ చేస్తూ ఇబ్బంది పెట్టారు. వారి ప్రయివేట్‌ పార్ట్స్‌ను చూపిస్తూ జుగుప్సాకరంగా ప్రవర్తించారు. ఒక గ్రూప్‌ వాహనాలపైకి ఎక్కి ఇబ్బంది పెట్టగా.. మరో గ్రూప్‌ నడిరోడ్డుపై వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంది.​

ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. గత నెలరోజులుగా రోడ్డుపై ట్రాన్స్‌జెండర్స్‌ చేసే చట్టవ్యతిరేక పనులు అడ్డుకుంటున్నామన్నారు. వారు హజ్‌కాస్‌ ప్రదేశానికి వెళ్తామని అడిగారని, అక్కడికి వెళ్లినా ఇలాంటి పనులు చేయవద్దని సూచించామని చెప్పారు. దీంతో వారు నిరసనగా రచ్చచేశారని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన ఓ​ ఆరుగురు ట్రాన్స్‌జెండర్స్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే ఈ సమస్య తగ్గుతుందని గుర్తించినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. యువ స్కీమ్‌ కింద హస్పిటాలిటీ సెక్టార్‌లో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top