
విజయనగరం: ఉత్తరాంధ్రలో గంజాయి అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. అరకు నుంచి విజయనగరం జిల్లా ఎస్.కోట, కొత్తవలస మీదుగా గంజాయి తరలిస్తుండగా ముగ్గురు విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పది కేజీల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, ఒక ఫోర్డ్ కారు స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు, తేలిక సంపాదనకు అలవాటు పడి విద్యార్థులు గంజాయి రవాణాకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని స్థానిక సీఐ శ్రీరెడ్డి శ్రీనివాస రావు వెల్లడించారు.
పట్టుబడిన విద్యార్థులు చల్లా రాహుల్ రెడ్డి, కొమ్ముల సాయి సుమంత్, భోగ్యం సాయికిరణ్‌లు గుంటూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. చెన్నైకి చెందిన అశోక్ అనే మరో వ్యక్తి, వీరికి డబ్బులు ఆశగా చూపి ఇదంతా నడిపిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని అన్నారు.