దీపావళి షాపింగ్‌కు తీసుకెళ్ల లేదని..

Teen Stabbed To Death For Refusing To Take Neighbour Diwali Shopping - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచోసుకుంది. దీపావళి షాపింగ్‌కు తీసుకెళ్లలేదనే కోపంతో పక్కింటి వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు ఓ టీనేజర్‌. ఈ ఘోరం గురువారం రాత్రి 11.40 సమయంలో నార్త్‌వెస్ట్‌ ఢిల్లీ, జహంగీర్‌పురిలో చోటుచేసుకుంది. ఘటనాస్థలికి వెళ్లేలోపే మృతుడు దీపక్‌ తీవ్రంగా గాయపడ్డాడని, హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ అతను మరణించాడని పోలీసులు పేర్కొన్నారు.

బుధవారం దీపావళి షాపింగ్‌కు దీపక్‌ తన బైక్‌పై ఎక్కించుకోలేదని నిందితుడు యోగేష్‌ (19) గొడవపడ్డాడని, అనంతరం ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని తెలిపారు. కానీ యోగేశ్‌ మాత్రం పగతో దీపక్‌ను చంపాలని భావించడాని, అదును కోసం వేచి చూసి చంపేశాడని పేర్కొన్నారు. యోగేష్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top