నవ్వినందుకు చితకబాదాడు

Teacher Beaten Student While Laughing in Class Hyderabad - Sakshi

ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు

పంజగుట్ట: క్లాస్‌ రూంలో నవ్వినందుకు ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని చితక బాదాడు. సదరు విద్యార్థి కుటుంబ సభ్యులతో కలిసి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎమ్‌ఎస్‌ మక్తాకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ అజీజ్‌ కుమారుడు అబ్దుల్‌ రహమాన్‌ (11) స్థానిక ఇక్రా హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్‌లో జీషన్‌ అనే ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని కొట్టాడు. దీనిని చూసిన అబ్దుల్‌ రహమాన్‌ నవ్వడంతో ఆగ్రహానికి లోనైన జీషన్‌ అతడిని తీవ్రంగా కొట్టాడు. బాధితుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా సదరు టీచర్‌ స్టేషన్‌కు వచ్చి విద్యార్థి కుటుంబ సభ్యులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top