పోలీసు హెడ్‌క్వార్టర్స్‌పై ఉగ్రవాదుల మెరుపుదాడి | Suicide Bomber, Gunmen Attack Police HQ In Afghan Province | Sakshi
Sakshi News home page

పోలీసు హెడ్‌క్వార్టర్స్‌పై ఉగ్రవాదుల మెరుపుదాడి

Oct 17 2017 12:28 PM | Updated on Mar 28 2019 6:10 PM

Suicide Bomber, Gunmen Attack Police HQ In Afghan Province - Sakshi

కాబుల్‌ : అప్ఘనిస్థాన్‌ పోలీసు ఉన్నత కార్యాలయాలపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఓ ఉగ్రవాది కారు బాంబుతో ఆత్మహుతి దాడికి పాల్పడగా పలువురు సాయుధులు కాల్పులతో తెగబడ్డారు. ఈ దాడిని తామే చేసినట్లు ఉగ్రవాద సంస్థ తాలిబన్‌ ప్రకటించింది. ఈ దాడిలో ఎంతమంది చనిపోయారు? ఎంత నష్టం జరిగిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం పక్తియా ప్రావిన్స్‌లోని గార్డెజ్‌ ప్రాంతంలో పోలీసుల శిక్షణ కేంద్రం ఉంది. అక్కడే పోలీసుల హెడ్‌క్వార్టర్స్‌ కూడా ఉన్నాయి. వాటినే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని ప్రస్తుతానికి అత్యవసర సమయాల్లో స్పందించే బృందం ఉగ్రవాదులను కట్టడి చేసే పనిలో ఉందని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement