పరీక్షలు ఫెయిలయ్యాననే.. | Student commits suicide | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఆత్మహత్య

Jun 5 2018 3:01 PM | Updated on Nov 9 2018 4:36 PM

Student commits suicide - Sakshi

రచన మృతదేహం    

హుజూరాబాద్‌రూరల్‌ : పరీక్షల్లో ఫెయిలయ్యానని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హుజూరాబాద్‌ మండలం కొత్తపల్లిలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన మిసరగండ్ల రవీందర్‌-లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. తండ్రి హమాలీ పనిచేస్తుండగా తల్లి దినసరి కూలీ. వీరి కుమార్తె రచన(20) హుజూరాబాద్‌లోని ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సెకండియర్‌ చదువుతుంది.

ఇటీవల విడుదలైన సెమిస్టర్‌ ఫలితాల్లో కొన్ని సబెక్టుల్లో ఫెయిలైంది. మానసిక వేదనకు గురైన రచన సోమవారం తెల్లవారు జామున వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్క ల ప్రాంతాల్లో గాలించారు. గ్రామానికి సమీపంలోని వ్యవసాయబావి వద్దకు వెళ్లినట్లు గ్రామస్తులు తెలపగా.. అక్కడికెళ్లి చూడగా శవమై కనిపించింది.

జీవచ్చవంలా పడి ఉన్న కూతురును చూసి తల్లిదండ్రులు గుండె లవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం కోసం హుజూరాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై లింగారెడ్డి పంచనామా చేశారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు.      

Advertisement
 
Advertisement
Advertisement