పక్కపక్కనే సమాధులు ఉంచాలంటూ.. | Sandeepa Reddy And Triveni Committed Suicide In Hyderabad | Sakshi
Sakshi News home page

పక్కపక్కనే సమాధులు ఉంచాలంటూ.. ప్రేమజంట ఆత్మహత్య

Jun 25 2019 7:23 AM | Updated on Jun 25 2019 8:28 AM

Sandeepa Reddy And Triveni Committed Suicide In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ‘మేము ఇద్దరం మరణించాక పక్కపక్కనే సమాధులు ఉంచాలి’ అంటూ ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. ప్రేమ వ్యవహారం, కుటుంబ కలహాలతో నల్గొండ జిల్లా రంగారెడ్డి గూడకు చెందిన సందీప్‌ రెడ్డి, త్రివేణి కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో సందీప్‌రెడ్డి మృతి చెందగా, త్రివేణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 

ఈ దుర్ఘటన చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. వీరిద్దరు బంధువులు అయ్యింటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement