
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మొయింజా మార్కెట్ సర్కిల్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. సిగ్నల్ మలుపు వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు బోల్తాకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా ఏడుగురు ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.