‘నన్ను కాదంటావా.. అయితే చావు’ | Refused by woman jilted lover shot her dead | Sakshi
Sakshi News home page

‘నన్ను కాదంటావా.. అయితే చావు’

Nov 5 2017 12:25 PM | Updated on Nov 5 2017 12:39 PM

Refused by woman jilted lover shot her dead - Sakshi

ఝాన్సీ (ఉత్తర్‌ ప్రదేశ్‌) :  ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో యువతిని కాల్చిచంపాడో దుండగుడు. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగింది. రోహిత్‌ కుష్వా అనే 24 ఏళ్ల యువకుడు కొంత కాలంగా 21 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. దీనిపై బాధిత యువతి పలుసార్లు అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అయినా రోహిత్‌ మాత్రం ఆమె మాటలను పట్టించుకోలేదు.

ఎప్పటిలానే శనివారం సాయంత్రం కూడా.. రోహిత్‌ ప్రేమిస్తున్నానంటూ యువతిపై వేధింపులకు దిగాడు. అంతేకాక లైంగిక దాడి కూడా మొదలు పెట్టాడు. దాంతో ఆగ్రహించిన యువతి.. రోహిత్‌ను చెప్పుతో కొట్టింది. ఆవమానంగా భావించిన రోహిత్‌ తనవెంట తెచ్చుకున్న తుపాకితో పాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌లో కాల్చి పారిపోయాడు.

కొనప్రాణంతో కొట్టుకుంటున్న యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలోనే యువతి తుది శ్వాస విడిచింది. ఇదిలా ఉండగా.. రోహిత్‌ను హత్యానేరం కింద అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement