జైలులో నిర్మలాదేవి ఆత్మహత్యాయత్నం!

Professor Nirmala Devi Suicide Attempt in Tamil Nadu jail - Sakshi

న్యాయవాది సంచలన వ్యాఖ్యలు

టీ.నగర్‌: ప్రొఫెసర్‌ నిర్మలాదేవి జైలులో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆమ తరఫు న్యాయవాది గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విరుదునగర్‌ జిల్లా, అరుప్పుకోట్టైకు చెందిన ప్రొఫెసర్‌ నిర్మలాదేవి. ఈమె అక్కడే ఉన్న కళాశాల విద్యార్థినులకు లైంగిక ఎరవేసిన నేపథ్యంలో ఏప్రిల్‌లో అరెస్టయి మదురై సెంట్రల్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా శ్రీవిల్లిపుత్తూరులో గురువారం కేసు విచారణకు నిర్మలాదేవి హాజరుకావాల్సి ఉండగా ఆమె హాజరుకాలేదు.

బెయిలుపై విడుదలైన ప్రొఫెసర్‌ మురుగన్, కరుప్పసామి కోర్టుకు హాజరయ్యారు. దీంతో ఈ కేసు మార్చి నెల 20వ తేదీకి వాయిదా పడింది. సాయంత్రం మూడు గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్మలాదేవిని హాజరుపరిచి కేసు వాయిదా వివరాలను తెలిపారు. దీనికి సంబంధించి ఆమె న్యాయవాది పసుంపొన్‌ పాండియన్‌ మాట్లాడుతూ నిర్మలాదేవి అధికార పక్ష నేతల బెదిరింపులకు గురవుతున్నారన్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా బెదిరిస్తున్నట్లు తెలిపారు. గతంలో కోర్టులో విచారణకు హాజరుపరిచి మదురైకు వస్తున్న మార్గంలో కృష్ణన్‌కోవిల్‌కు, టి.కల్లుపట్టికి మధ్య పోలీసు వ్యాను నిలిపి నిర్మలాదేవిపై పోలీసులు దాడి చేసినట్లు తెలిపారు. ఇందులో ఆమెకు గాయాలు ఏర్పడ్డాయని, దీంతో ఆమె మదురై సెంట్రల్‌ జైలులో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆమెను సిబ్బంది అడ్డుకున్నట్లు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top