వైద్యుల నిర్లక్ష్యం.. చెట్టు కిందే ప్రసవం

Pregnant Woman Delivery Under A Tree In Nalgonda Government Hospital - Sakshi

సాక్షి, నల్గొండ : నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె ఆస్పత్రి ఆవరణలోని చెట్టు కిందే ప్రసవించింది. మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెంకు చెందిన ఓ గర్భిణీ రెండో కాన్పు కోసం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అయితే ఆమెకు రక్తం తక్కువగా ఉండడంతో రక్తం తెస్తే ట్రీట్‌మెంట్‌ చేస్తామని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు.

దీంతో అప్పటికే మహిళకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అక్కడే చెట్టుకింద ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా ఆస్పత్రి సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వైద్యులు తీరుకు నిరసనగా ఆమె బంధువువలు ఆందోళనకు దిగారు. దీంతో మహిళను ఆస్పత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తల్లి బిడ‍్డ క్షేమంగా ఉన్నారు.  కాగా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top