నర్సు ఆత్మహత్య | Nurse Commits Suicide in Tamil Nadu | Sakshi
Sakshi News home page

నర్సు ఆత్మహత్య

Jul 11 2019 7:18 AM | Updated on Jul 11 2019 7:18 AM

Nurse Commits Suicide in Tamil Nadu - Sakshi

ఉమాభారతి (ఫైల్‌)

చెన్నై  ,అన్నానగర్‌: దిండివనం సమీపంలో మంగళవారం ప్రైవేటు ఆసుపత్రి నర్సు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దిండివనం సమీపం కొళ్లార్‌ గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్‌ రైతు. ఇతని కుమార్తె ఉమాభారతి (20). సెంజిలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. మంగళవారం పని ముగించుకుని ఇంటికి వచ్చిన ఉమాభారతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు ఆమెను కిందకు దింపి చికిత్స కోసం దిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు  ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement