అజ్ఞాతంలోకి సంజయ్‌.. పోలీసుల గాలింపు

Nirbhaya Case Against Dharmapuri Sanjay - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ తనయుడు సంజయ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైంగిక వేధింపుల కేసులో అతన్ని అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. సంజయ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదుకాగా, అరెస్ట్‌ చేయడానికి శుక్రవారం సాయంత్రం పోలీసులు సంజయ్‌ ఇంటికి వెళ్లారు. అయితే సంజయ్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో  పోలీసులు గాలింపు చేపట్టారు. (శాంకరి కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాం)

సంజయ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది నర్సింగ్‌ విద్యార్థినులు గురువారం తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి  ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాయిని సూచన మేరకు ఈ ఉదయం నిజామాబాద్‌ సీపీని కలిసి విద్యార్థులు మరోసారి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో సంజయ్‌పై నిర్భయ యాక్ట్‌ కింద కేసును పోలీసులు నమోదు చేశారు. సంజయ్‌ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.

అయితే తాను ఎవరినీ వేధించలేదంటూ సంజయ్‌ ఆ ఆరోపణలను ఖండించిన విషయం విదితమే. విద్యార్థినులపై సంజయ్‌ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్‌ చేయాలనీ, శాంకరి నర్సింగ్‌ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు కూడా.

'అది టీఆర్‌ఎస్‌ అంతర్గత వ్యవహారం'

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top