పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి

Nine Killed And 11 Injured In Suicide Attack On Pakistan Army - Sakshi

ఢిల్లీ: బలూచిస్తాన్‌లోని తుర్బట్‌ ప్రాంతంలో పాకిస్తాన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తామే ఈ దాడికి పాల్పడినట్లు బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ అనే సంస్థ, బలోచ్‌ రిపబ్లికన్‌ గార్డ్‌ ప్రకటించుకున్నాయి. సౌదీ అరేబియా రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వచ్చే కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. భారత్‌, పాకిస్తాన్‌లలో జరిగిన ఈ ఘటనలతో ఉపఖండంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top