వివాహేతర సంబంధం : సోదరిపై దాడి | Men Held For Attacking Sister Over Relationship | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం : సోదరిపై దాడి

Jun 4 2019 1:52 PM | Updated on Jun 4 2019 2:07 PM

Men Held For Attacking Sister Over Relationship - Sakshi

వివాహేతర సంబంధం : సోదరిపై దాడి

లక్నో : వివాహితుడితో సన్నిహితంగా ఉంటోందని సోదరిపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బులంద్‌షహర్‌ జిల్లా గులోతికి చెందిన నిందితులను ఇర్ఫాన్‌, రిజ్వాన్‌, ఇమ్రాన్‌లుగా గుర్తించారు. బులంద్‌షహర్‌కు చెందిన భూస్వామి కుమారుడితో తమ సోదరి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందనే కోపంతో ఆమెపై దాడి చేశామని నిందితులు విచారణలో వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే 5న కుటుంబ సభ్యులు అలీగఢ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో ఇర్ఫాన్‌, రిజ్వాన్‌, సల్మా స్కూటర్‌పై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో సల్మాపై ఇద్దరు సోదరులు దాడి చేశారు. ఆమెపై యాసిడ్‌ పోయడంతో పాటు తీవ్రంగా కొట్టారు. సల్మా మరణించిందని భావించిన నిందితులు దాద్రిలోని లుహర్లి బ్రిడ్జి వద్ద ఆమెను విడిచివెళ్లారు. స్ప్రహలోకి వచ్చిన అనంతరం సల్మా తనపై సోదరులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, బాధితురాలు ప్రస్తుతం సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement