విమానంలో భయంకర చర్య, వైరల్‌ వీడియో

Man Smokes Cigarette on Spirit Airlines Flight to Minneapolis Video Goes Viral - Sakshi

అమెరికాలోని మిన్నెపోలీస్‌కు చెందిన స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఒక పబుద్ధుడు కలకలం రేపాడు. విమానంలో ఉన్నట్టుండి ఒక  ప్రయాణికుడు లైటర్‌ సహాయంతో దర్జాగా సిగరెట్‌ ముట్టించాడు. దీంతో పక్క వరుసలో కూర్చున్న మహిళా ప్రయాణికురాలు బిత్తరపోయింది. మిగిలిన ప్రయాణికులు కూడా భయాందోళనకు లోనయ్యారు. చివరకు ఫ్లైట్‌ అడెంటెండ్‌కు ఫిర్యాదు చేశారు. విమానం ఎక్కిన దగ్గరనుంచి అతను వింతగా ప్రవర్తిస్తున్నాడని సహ ప్రయాణికురాలు ఆరోపించారు. అందుకే సిగరెట్‌ ముట్టించగానే వీడియో తీసానని పేర్కొన్నారు.  ఈ భయంకరమైన ఘటనకు సంబంధించిన  వీడియో సోషల్‌ మీడియాలో​ హల్‌ చల్‌ చేస్తోంది. చట్ట విరుద్ధంగా లైటర్‌ను విమానంలోకి ఎలా తీసుకొచ్చాడు.. ధూమపానం ఎలా చేశాడు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top