జగిత్యాలలో కాల్పుల కలకలం | Man Opens Fire In Jagtial | Sakshi
Sakshi News home page

జగిత్యాలలో కాల్పుల కలకలం

Feb 4 2020 9:32 AM | Updated on Feb 4 2020 10:04 AM

Man Opens Fire In Jagtial - Sakshi

సాక్షి, జగిత్యాల : భార్యభర్తల గొడవ కాల్పులకు దారితీసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిదారం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు శ్రీనివాస్‌, ఇస్రాజుపల్లికి చెందిన గీతిక దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గీతిక ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.

కాగా, గత అర్థరాత్రి ఇస్రాజుపల్లికి వెళ్లిన శ్రీనివాస్‌.. భార్యతో గొడవకు దిగాడు. మేనమామ రాజిరెడ్డి అడ్డుకోబోగా శ్రీనివాస్‌ అతనిపై తుపాకితో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో రాజిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్క బులెట్‌ కడుపులో నుంచి మరో బులెట్‌ చేతులోనుంచి దూసుకెళ్లింది. రాజిరెడ్డి ప్రసుత్తం జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement