వెడ్డింగ్‌ పార్టీలో డ్యాన్స్ : భార్యను కడతేర్చిన భర్త

Man Kills Wife For Dancing With Guests At Wedding - Sakshi

పట్నా : వివాహ వేడుకలో అతిధులతో కలిసి డ్యాన్స్‌ చేయడమే భార్య ప్రాణాల మీదకు తెచ్చింది. బిహార్‌లోని పట్నా జిల్లా హసది ముషారి ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖోరంగ్‌పూర్‌ గ్రామానికి చెందిన రంజిత్‌ మాంఝీ భార్య మునియా దేవి హసదిలోని తన తల్లితండ్రుల వద్దకు పదిరోజుల కిందట పిల్లలతో కలిసి వచ్చారు.

ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఆమె భర్త కూడా మూడు రోజుల కిందట అత్తగారింటికి చేరుకున్నాడు. సోమవారం రాత్రి పెళ్లి వేడుకలో భర్త, పిల్లలతో కలిసి మునియా కూడా పాల్గొన్నారు. ఇక డీజేకు అనుగుణంగా వెడ్డింగ్‌ పార్టీలో అతిధులతో కలిసి మునియా డ్యాన్స్‌ వేయడం భర్త రంజిత్‌ మాంఝీకి ఆగ్రహం కలిగించింది. అందరి ఎదుటే భార్యను చితకబాదిన మాంఝీ ఆ తర్వాత ఆమెను పశువుల పాకలోకి తీసుకువెళ్లి ఊపిరిఆడకుండా చేసి ప్రాణం తీశాడు. ఘటనా స్ధలంలోనే భార్య మునియా మరణించగా నిందితుడు పరారయ్యాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top