
మృతి చెందిన వ్యక్తి
బొబ్బిలి: మండలంలోని దిబ్బగుడివలస రైల్వే గేటు వద్ద రైలు కిందపడి ఒకరు మృతి చెందినట్లు జీఆర్‌పీ ఎస్సై సీహెచ్‌ఎల్‌ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో మక్కువ మండల కేంద్రానికి చెందిన బొద్దాన కాశి (38) మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. దిబ్బగుడివలస గేటు, సీతానగరం మధ్యలో ఇతను మృతి చెంది ఉన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.