ప్రముఖ నటిపై బూతుల వర్షం.. అరెస్టుల పర్వం | Man arrested for trolling threatening Parvathy | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటిపై బూతుల వర్షం.. అరెస్టుల పర్వం

Dec 27 2017 5:08 PM | Updated on Oct 22 2018 6:05 PM

Man arrested for trolling threatening Parvathy - Sakshi

సాక్షి, తిరువనంతపురం : ప్రముఖ మళయాల నటి పార్వతీని సోషల్‌ మీడియా వేదికగా బూతులతో టార్గెట్‌ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ఇష్టమొచ్చినట్లుగా తిడుతూ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టడంతోపాటు వార్నింగ్‌లు కూడా ఇచ్చిన నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేరళలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో  పార్వతీ మాట్లాడుతూ మమ్ముటి నటించిన చిత్రంపై విమర్శలు చేశారు.

ఆయన నటించిన కాసాబా చిత్రంలో మహిళలను అవమానించే సన్నివేశాలు చాలా ఉన్నాయని, ఆ సినిమా చూసినందుకు తాను చాలా బాధపడ్డానని, అలాగే ఆ సినిమా చూసే ప్రతి స్త్రీ బాధపడుతుందని అన్నారు. దాంతో మమ్మూటీ ఫ్యాన్స్‌ పేరిట పలువురు పార్వతీపై సోషల్‌ మీడియా వేదికగా దాడులు చేశారు. అసభ్యకర సందేశాలు పంపించడమే కాకుండా ఆమె ప్రాణానికి హానీ చేస్తామంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో వాటి తాలుకూ యూఆర్‌ఎల్స్‌ మొత్తాన్ని ఆమె పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఓ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు సదరు సోషల్‌ మీడియా వేదికల నుంచి అదనపు సమాచారం కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement