చాటుగా పెళ్లి చేసుకుని మోసపోయా.. | Lover Complaint Cheating Case on Boyfriend in Medak | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో మోసపోయా..

Jun 22 2020 9:12 AM | Updated on Jun 22 2020 9:53 AM

Lover Complaint Cheating Case on Boyfriend in Medak - Sakshi

బాధితురాలు ప్రవీణ

చిన్నశంకరంపేట(మెదక్‌): ప్రేమ పేరుతో మోసపోయాను.. చాటుగా పెళ్లి చేసుకుని తీరా తనతో ఎలాంటి సంబంధం లేదంటున్న యువకుడిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఓ యువతి చిన్నశంకరంపేట పోలీస్‌లను ఆశ్రయించింది. చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లికి చెందిన చింతాకుల ప్రవీణ స్వగ్రామానికి చెందిన యువకుడి చేతిలో మోసపోయానని పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. ఏడాది క్రితం నుంచి ప్రేమించుకుంటున్నామని, తనను హైదరాబాద్‌కు తీసుకెళ్లి కాపురం కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. (‘చీకటి’ లోకంలో ప్రేమ కాంతులు)

గర్బం దాల్చడంతో టాబ్లెట్లు ఇచ్చి గర్బం పోయోలా చేశాడని వివరించింది. చివరికి కట్న, కానుకలు తీసుకువస్తేనే తనతో కాపురం చేస్తానని వేదిస్తున్నాడని తెలిపింది. ఈ నెల 14న గ్రామస్తుల సమక్షంలో గుడి వద్ద పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువకుడు తర్వాత ముఖం చాటేశాడని వాపోయింది.  తనకు న్యాయం చేసి యువకుడితో కాపురం చేసేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంది. ఈ విషయంపై ఎస్‌ఐ మాట్లాడుతూ.. విచారించి యువతికి న్యాయం చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement