ఒకరితో ప్రేమ మరొకరితో సహజీవనం

Lover Case Files On Boyfriend Trapped her Friend In Hydeerabad - Sakshi

నిందితుడిపై కేసు నమోదు

బంజారాహిల్స్‌: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి సహజీవనం చేస్తున్నాడు. అదే సమయంలో తన స్నేహితురాలిని చూడటానికి వచ్చిన యువతిపై కన్నేసి ఆమెను కూడా లోబర్చుకున్నాడు. గుట్టు రట్టయ్యేసరికి పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌12లోని శ్రీరాంనగర్‌లో నివసించే ప్రేమ్‌కుమార్‌(26) నిరుద్యోగి. నాలుగు నెలల క్రితం టి.స్రవంతి (26) అనే స్థానికురాలితో పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది.

పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆయనతో సహజీవనం చేయసాగింది.ఇదే సమయంలో ఆమె స్నేహితురాలు ప్రియాచౌదరితో కూడా సన్నిహితంగా మెలగసాగాడు. ఇదేమిటని ప్రశ్నించినందుకు చంపేస్తానంటూ హెచ్చరించడమే కాకుండా రెండు రోజులక్రితం తీవ్రంగా కొట్టాడు. బాధితురాలి పిర్యాదు మేరకు ప్రేమ్‌కుమార్‌పై పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top